hottest cities | ప్రపంచంలోనే టాప్ 50 వేడి నగరాలు ఇండియాలోనే.. 11వ స్థానంలో జగిత్యాల
hottest cities : తెలంగాణలోని జగిత్యాలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 43 డిగ్రీల ఎండలతో జగిత్యాల దేశంలోనే 11వ స్థానంలో ఉండటం విశేషం.
hottest cities : భారత దేశం ఎప్పుడూ లేనంతగా ఎండలతో అట్టుడికిపోతోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా భారీగా ఎండలు నమోదయ్యాయి. ఇక, తెలంగాణలోని జగిత్యాలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 43 డిగ్రీల ఎండలతో జగిత్యాల దేశంలోనే 11వ స్థానంలో ఉండటం విశేషం. ఉదయం ప్రపంచంలోనే అత్యధిక ఎండ (ఉష్ణోగ్రత) కలిగిన టాప్ 50 నగరాలు ఇండియాలోనే ఉన్నాయి.
వాతావరణం, ఉష్ణోగ్రతలు వంటి వాటిని పరిశీలించే ఏక్యూఐ డాటా ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు అత్యధిక ఎండలు ఇండియాలోనే నమోదయ్యాయి. టాప్ 50 నగరాల్లో ఇతర దేశాలకు చెందిన ఒక్క నగరం కూడా లేదంటే దేశంలో ఏ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉదయం పదకొండు గంటలకు ముందే ఒడిశాలోని బాలంగిర్‌లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం కూడా కాకముందే ఇలా అనేక చోట్ల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రెండో స్థానంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ (44 డిగ్రీలు), మూడో స్థానంలో యూపీలోని ప్రయాగ్‌రాజ్ (44 డిగ్రీలు), నాలుగు, ఐదు స్థానాల్లో చత్తీస్‌గడ్‌లోని బిలాస్పూర్, మహాసముంద్ (44 డిగ్రీలు), ఆరవ స్థానంలో బిహార్‌లోని బుక్సర్ (44 డిగ్రీలు), ఏడో స్థానంలో చత్తీస్‌గడ్‌లోని దుర్గ్ (44 డిగ్రీలు), ఎనిమిదో స్థానంలో బిహార్‌లోని సాసారామ్ (43 డిగ్రీలు), తొమ్మిదో స్థానంలో చత్తీస్‌గడ్‌లోని భిలాయ్ (43 డిగ్రీలు), పదో స్థానంలో యూపీలోని మీర్జాపూర్ (43 డిగ్రీలు) నిలిచాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో తెలంగాణకు చెందిన జగిత్యాల ఉంది.
వాయువ్య భారతం నుంచి వేడిగాలులు వీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందని వాతావరణ నిపుణులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దాదాపు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఒడిశా, చత్తీస్గడ్ మీదుగా మధ్యప్రదేశ్.. అటు నుంచి యూపీ, బిహార్, హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లకు వడగాల్పులు వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ ప్రభావానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- heatwave
- hottest cities
- India
- sun
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

