Man Kills Wife | భార్యపై అనుమానం.. ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపిన భర్త
Man Kills Wife | తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ఆమె భర్త అనుమానించాడు. మద్యానికి బానిసైన అతడు ఇంట్లో నిద్రిస్తున్న భార్యను నరికి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ఆమె భర్త అనుమానించాడు. మద్యానికి బానిసైన అతడు ఇంట్లో నిద్రిస్తున్న భార్యను నరికి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Kills Wife) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల శోభ, పర్గుండ సరవాద్కు 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, కటగేరిలోని ఓజికర్ మఠం పాఠశాలలో వంట మనిషిగా శోభ పనిచేస్తున్నది. అయితే తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన అతడు రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పదునైన ఆయుధంతో నరికి చంపాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. శోభ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆమె హత్యపై కేసు నమోదు చేశారు. నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే భార్య ప్రవర్తనపై భర్తకు ఉన్న అనుమానం, అతడి మద్యపాన వ్యసనం ఈ హత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

