లక్నో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు కుమార్తెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని డింపుల్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని డింపుల్ యాదవ్ సూచించారు.
मैंने कोविड टेस्ट कराया जिसकी रिपोर्ट पॉजिटिव है।
— Dimple Yadav (@dimpleyadav) December 22, 2021
मैं पूरी तरह से वैक्सिनेटेड हूं और कोई भी लक्षण अभी दिखाई नहीं दे रहे है।
अपनी और दूसरों की सुरक्षा की दृष्टि से मैंने खुद को अलग कर लिया है।
हाल फिलहाल मुझसे मिलने वाले सभी लोगों से अनुरोध है कि वे अपना टेस्ट जल्द कराएं।