Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కోచింగ్ సెంటర్లో చోటుచేసుకున్న విషాదంలో మరణించిన విద్యార్ధుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ లేఖలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, ఇతరులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఉవ్వెత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్లో జరిగిన దురదృష్టకర ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్ధులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం తమ బాధ్యతని మంత్రి వివరించారు.
Read More :
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. 4 గంటలకు గేట్లు ఓపెన్