Akhilesh Yadav | మోదీ హయాంలో పెచ్చుమీరిన నిరుద్యోగం : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : కాషాయ పాలకులే లక్ష్యంగా ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Akhilesh Yadav : కాషాయ పాలకులే లక్ష్యంగా ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలో స్మార్ట్ సిటీని రూపొందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందనీ, కానీ వారి స్మార్ట్ సిటీలో ఎక్కడచూసినా జలమయమైన రోడ్లు, చెత్తచెదారం పేరుకుపోయిన వీధులు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. కాషాయ పాలకుల హయాంలో ఎటుచూసినా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రజల వాహనాలు లోయల్లో పడిపోతున్నాయని అన్నారు.
ఆరోగ్య సేవలు, ఆస్పత్రులు ప్రాధమిక సౌకర్యాలు లేక పడకేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ బుధవారం ఇటావాలో విలేకరులతో మాట్లాడారు. యూపీలోని హథ్రాస్‌లో జరిగిన ఘటన కూడా అధికారుల వైఫల్యం కారణంగానే జరిగిందని ఆరోపించారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, యువత ఉద్యోగాల కోసం వీధుల చుట్టూ తిరుగుతున్నారని అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు యూపీలో వరదల ప్రభావంతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఫిలిబిత్, లఖింపూర్ ఖేరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్ధితిపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరదలతో 133 గ్రామాల్లో నష్టం వాటిల్లిందని, వేలాది ఎకరాల పంట దెబ్బతిన్నదని వివరించారు. వరదలపై సకాలంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా వాటిల్లకుండా చేయగలిగామని చెప్పుకొచ్చారు.
Read More :
Bengaluru Metro | బెంగళూరు మెట్రోలో ఘర్షణ.. బాక్సింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

