Loksabha Elections 2024 : బీజేపీ గ్రాఫ్ పతనమవుతోందని, బుందేల్‌ఖండ్‌లో ఆ పార్టీ పరిస్ధితి దిగజారిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ కన్నౌజ్ ఎంపీ అభ్యర్ధి అఖిలేష్ యాదవ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అహంకారానికి చరమగీతం పాడనున్నారని చెప్పారు.
బీజేపీ పట్ల జనాగ్రహం పెల్లుబుకుతున్నదని అన్నారు. రైతులకు నీటి సరఫరా కోసం కాషాయ పాలకులు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని, పంట కొనుగోళ్లకు సరైన వ్యవస్ధ నెలకొల్పలేదని దుయ్యబట్టారు. రేషన్ పేరుతో ప్రజలను బీజేపీ దగా చేస్తోందని మండిపడ్డారు. బుందేల్ ఖండ్ ప్రజలు తమకు ఎవరు శత్రువుల్లో గుర్తెరిగారని చెప్పారు.
యూపీ ప్రజలు ఎస్పీతో పాటు విపక్ష ఇండియా కూటమి పక్షాన ఉన్నారని, దేశంలో 140 కోట్ల మంది ప్రజలు బీజేపీని 140 సీట్లకు పరిమితం చేస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ వినాలని ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, వారు రాజ్యాంగం గురించి వినాలని కోరుకుంటున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
Read More :