Akhilesh Yadav | ఇండియా కూటమి వైపు నిలబడితే నితీష్ కుమార్ ప్రధాని అవుతారు : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : బిహార్ రాజకీయ పరిణామాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేకు చేరువవుతున్నారనే వార్తలపై అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Akhilesh Yadav : బిహార్ రాజకీయ పరిణామాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేకు చేరువవుతున్నారనే వార్తలపై అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమి వైపు గట్టిగా నిలబడితే ఆయన ప్రధాని అయ్యే వారని అన్నారు. కూటమిలో ఎవరినైనా ప్రధాని పదవికి పరిశీలించవచ్చు..నితీష్ కుమార్ గట్టి మద్దతుతో ప్రధాని పదవికి పోటీదారు అయ్యేవారని అఖిలేష్ వ్యాఖ్యానించారు.
జనవరి 28న నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. నితీష్ కుమార్ యూటర్న్ పట్ల నిరుత్సాహం వ్యక్తం చేసిన అఖిలేష్ తానిప్పటికీ జేడీయూ చీఫ్ ఇండియా కూటమిలోనే కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. నితీష్ కుమార్ చొరవ తీసుకుని ఇండియా కూటమి ఏర్పాటు చేశారని ఈ వ్యవహారంలో గందరగోళానికి తెరదించేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని అఖిలేష్ కోరారు.
ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశంపై అఖిలేష్ స్పందిస్తూ సమయంపై ఈ విషయం వెల్లడిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం విషయంలో ఈ వ్యవహారాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, దీని నుంచి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సరైన సమయంలో తాను అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తానని ఎస్పీ చీఫ్ వెల్లడించారు.
Read More :
గుడిని కూల్చి మసీదు కట్టారు… జ్ఞానవాపి కింద హిందూ ఆలయం.. తేల్చిన పురావస్తు శాఖ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

