గుడిని కూల్చి మసీదు కట్టారు… జ్ఞానవాపి కింద హిందూ ఆలయం.. తేల్చిన పురావస్తు శాఖ
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది.
- మసీదు కింద దేవాలయం ఆనవాళ్లు
- స్తంభాలు, బండరాళ్లు ఆ ఆలయానివే
- ఇప్పటికీ కనిపిస్తున్న కళాకృతులు, శాసనాలు
- తెలుగు, కన్నడ తదితర భాషల్లో శాసనాలు
- జ్ఞానవాపి కేసులో పురావస్తు శాఖ సంచలన నివేదిక
లక్నో, జనవరి 25: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది. మసీదు కింద దేవాలయపు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది. స్థల వివాదంపై కోర్టుకెక్కిన హిందువులు, ముస్లింలకు సర్వే వివరాలను అందించాలన్న కోర్టు ఆదేశం మేరకు ఏఎస్ఐ తన 839 పేజీల నివేదికను అందజేసింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను హిందువుల తరఫున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం వెల్లడించారు. పురావస్తు శాఖ నివేదికను ఆయన మీడియా ముందు చదివి వినిపించారు. పురావస్తు శాఖ నివేదిక.. మసీదు ఆవరణలో భారీ హిందూ దేవాలయం ఉనికిని సూచిస్తున్నదని పేర్కొన్నారు. అంతకుముందున్న దేవాలయంపైనే ప్రస్తుతమున్న కట్టడం (మసీదు)ను నిర్మించారని తెలిపారు.
ఇందుకు తగిన అనేక ఆధారాలను పురావస్తు శాఖ తన నివేదికలో పొందుపరిచిందని చెప్పారు. ఆ ప్రదేశంలోని అనేక చారిత్రక నిర్మాణపు పొరలకు సంబంధించి పురావస్తు శాఖ పలు ప్రశ్నలను లేవనెత్తిందని పేర్కొన్నారు. స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి దేవాలయపు స్తంభాలను, ప్లాస్టర్‌ను మసీదు నిర్మాణానికి వాడుకున్నారని తెలిపారు. దేవాలయపు స్తంభాలపై ఉన్న కళాకృతులను చెరిపివేసినట్టు పురావస్తు శాఖ పేర్కొందని వెల్లడించారు. పురాతన దేవాలయానికి సంబంధించిన శాసనాలు కూడా ఆ ఆవరణలో లభించాయని, అవి దేవనాగరి, తెలుగు, కన్నడతోపాటు ఇతర భాషల్లో ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతమున్న కట్టడం (మసీదు), అంతకుముందు కట్టడంపై అనేక శాసనాలను గమనించామని పురావస్తు శాఖ తెలిపిందని అన్నారు. మొత్తంగా ప్రస్తుత సర్వేలో 34 శాసనాలు, 32 ముద్రలున్న పత్రాలు బయటపడ్డాయని చెప్పారు. దేవాలయానికి సంబంధించిన ఓ బండరాయిపై శాసనాలు కనిపించాయని, ఆ రాయిని మసీదు నిర్మాణంలో, ఆ తరువాత మరమ్మతు సమయంలో కూడా వాడుకున్నారని తెలిపారు. దీనిని బట్టి పూర్వ నిర్మాణాన్ని కూల్చివేసి దానికి సంబంధించిన కొన్ని భాగాలను నూతన (మసీదు) నిర్మాణంలో వాడుకున్నట్టు తెలుస్తున్నదని అన్నారు. ఆ శాసనాలలో ‘జనార్దన’, ‘రుద్ర’, ‘ఉమేశ్వర’ అనే దేవతల పేర్లు కనిపించాయని చెప్పారు. తామర పతకానికి ఇరువైపులా చెక్కిన వ్యాల బొమ్మలను చెరిపివేశారని తెలిపారు.
ఆలయం మూలల్లో ఉన్న బండరాళ్లను తొలగించి, ఆ స్థలాన్ని పువ్వుల ఆకృతులతో నింపివేశారని చెప్పారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనున్న జ్ఞానవాపి మసీదుపై పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేకు సంబంధించిన నివేదికను హిందువులకు, ముస్లింలకు అందజేయాలని స్థానిక కోర్టు బుధవారం ఆదేశించింది. ప్రస్తుతమున్న 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న దేవాలయాన్ని కూల్చివేసి నిర్మించారని ఆరోపిస్తూ కొందరు హిందువులు దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన వారణాసి కోర్టు పురావస్తు శాఖ సర్వేకు ఆదేశించింది. పూర్వమున్న హిందూ దేవాలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారా లేదా అన్నది తేల్చేందుకు పురావస్తు శాఖ గత ఏడాది జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

