Bulldozer : అక్టోబర్ 1 వరకూ దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రహదారులు, ఫుట్‌పాత్‌ల వంటి బహిరగం ప్రదేశాల్లో అనధికార నిర్మాణాలకు ఈ ఉత్తర్వులు వర్తించబోవని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1 వరకూ దేశవ్యాప్తంగా బుల్డోజర్ల దూకుడుకు అడ్డుకట్ట పడనుంది.
కాగా, సుప్రీంకోర్టు తీర్పును సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. బుల్డోజర్ కూల్చివేతలతో న్యాయం జరగదు..ఇది రాజ్యాంగ విరుద్ధం, బుల్డోజర్తో ప్రజలను భయపెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. విపక్షాల గొంతు నొక్కేందుకే ఉద్దేశపూర్వకంగానే బుల్డోజర్ను తెరపైకి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. బుల్డోజర్ను నిలువరించేలా సుప్రీంకోర్ట్ జారీ చేసిన ఆదేశాలకు తాను సర్వోన్నత న్యాయస్ధానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో బుల్డోజర్లు ఆగిపోతాయని, న్యాయస్ధానం ద్వారా న్యాయం జరుగుతుందనే ఆశ చిగురించిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.పేదల పైనే బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారని, పెద్దల ఆక్రమణలు, కబ్జాలపై బుల్డోజర్లు కన్నెత్తి చూడవని అన్నారు. బుల్డోజర్‌తోనే న్యాయం జరుగుతుందని సీఎం, యూపీ ప్రభుత్వం, కాషాయ నేతలు ప్రచారం చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
Read More :
SEC | రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని