SEC | రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (SEC) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (SEC) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. 1988 బ్యాచ్‌కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెని తిరిగి అదే హోదాలో కొనసాగించింది.
ఇప్పటి వరకు ఎస్ఈసీగా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. దీంతో ఎస్ఈసీగా రాణి కుమిదినిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేండ్ల పాటు ఆమె ఎస్ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించారు. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా మూడేండ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

