Samajwadi Party Chief : ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎస్పీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీపై మండిపడ్డారు. అఖిలేష్ మంగళవారం లక్నోలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
యూపీలో కన్నౌజ్, ఫరక్కాబాద్ వంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని, మహిళలపై నేరాల విషయంలో యూపీ ముందువరసలో ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా పనిచేయకపోవడంతో మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు సహా ప్రతి ఒక్కరి భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
బహ్రైచ్లో తోడేళ్ల దాడిలో చోటుచేసుకుంటున్న మరణాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడంతో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతపై ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల పట్ల యోగి ఆదిత్యానాథ్ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు.
Read More :
Heavy rains | తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు