లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ అత్తర్ పేరుతో పెర్ఫ్యూమ్ను లాంఛ్ చేశారు. రెడ్, గ్రీన్ గ్లాస్‌ల్లో సిద్ధమైన ఈ పెర్ఫ్యూమ్ను 22 సహజసిద్ధమైన సెంట్స్తో తయారుచేశారు. 2022లో ఈ సెంట్ మేజిక్ సృష్టిస్తుందని అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
పెర్ఫ్యూమ్ బాటిల్‌పై అఖిలేష్ యాదవ్ ఫోటోతో పాటు ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ముద్రించారు. కన్నౌజ్‌కు చెందిన పార్టీ నేత, యూపీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ మాట్లాడుతూ ఎస్పీ పెర్ఫ్యూమ్ 2022లో విద్వేషాన్ని అంతమొందిస్తుంని అన్నారు. కాగా ఆగా, లక్నో, వారణాసి, కన్నౌజ్ నగరాల పేర్లతో నాలుగు ఫ్రాగ్రెన్సెస్తో ఈ ఫెర్ఫ్యూమ్ను రూపొందించారు. గతంలోనూ 2016లో తన ప్రభుత్వం నాలుగేండ్ల పాలనకు సంకేతంగా అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాది సుగంధ్ పేరిట పలు పెర్ఫ్యూమ్లను లాంఛ్ చేశారు.