లక్నో : పాకిస్తాన్ వ్యవస్ధాపకుడు మహ్మద్ అలీ జిన్నాను మహాత్మా గాంధీ, సర్ధార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూతో పోల్చుతూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నాడు. బీజేపీ చరిత్ర పుస్తకాలను మరోసారి చదవాలని అఖిలేష్ కాషాయ పార్టీ నేతలకు చురకలంటించాడు. అక్టోబర్ 31న పటేల్ 146వ జయంతోత్సవాల సందర్భంగా అఖిలేష్ జిన్నాపై ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్దార్ పటేల్, జాతి పిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నాలు ఒకే సంస్ధలో చదివి బారిస్టర్లుగా ఎదిగారని, వారు స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నడూ వెనుతిరగలేదని అన్నారు. ఎస్పీ నేత వ్యాఖ్యలను యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ఖండించారు. రాముడి భక్తులపై జిన్నా అనుకూలురు తుపాకీ గురిపెట్టారని అన్నారు. జిన్నాను ప్రశంసించిన అఖిలేష్ యాదవ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అఖిలేష్ను యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అఖిలేష్ అలీ జిన్నాగా అభివర్ణించారు.