న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ హక్కులపై గురువారం సభలో సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య వాగ్వాదం జరిగింది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, ‘లోక్‌సభ స్పీకర్ హక్కులు, మా హక్కుల్ని ఇక్కడ కాలరాస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న మీ (లోక్‌సభ స్పీకర్) హక్కుల్ని హరిస్తుంటే, మేం మీ తరఫున పోరాడాల్సి వస్తున్నది’ అని అన్నారు. ఆ వెంటనే అమిత్ షా కలుగజేసుకొని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతిని కించపరుస్తున్నారంటూ అఖిలేశ్‌పై మండిపడ్డారు. డొంకతిరుగుడుగా మాట్లాడొద్దని అన్నారు. స్పీకర్ హక్కులకు విపక్షాలు పరిరక్షకులు కారంటూ వ్యాఖ్యానించారు.