ప్రధాని నరేంద్ర మోదీ సీఎం యోగిపై చేసిన చమత్కారానికి సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. యూపీ+ యోగి.. కలిపితే ఉపయోగి అవుతుందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చమత్కరించారు. ఈ చమక్కులపై సమాజ్వాదీ అధ్యక్షుడు కౌంటర్ ఇచ్చారు. సీఎం యోగి ఉపయోగి కాదని, నిరుపయోగి (ఉపయోగం లేనివారు) అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. హాథ్రస్ కుటుంబీకులు, లఖింపూర్ రైతులు, గోరఖ్పూర్ వ్యాపారవేత్తలు, మహిళలు, నిరుద్యోగులు, దళితులు, వెనుకబడ్డవారు…వీరందరూ యోగి ప్రభుత్వం ఉపయోగం లేని ప్రభుత్వమని భావిస్తున్నారని అఖిలేశ్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. యూపీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం కోరుకోవడం లేదని అఖిలేశ్ పేర్కొన్నారు.