Ajit Pawar- Supriya Sule | అజిత్‌కు 65 ఏండ్లు.. ఆయన సీనియర్ సిటిజన్.. అన్నకు సుప్రియా స్ట్రాంగ్ కౌంటర్..!
Ajit Pawar- Supriya Sule | శరద్ పవార్ 80 ఏండ్లు దాటినా రిటైర్ కావడం లేదంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సుప్రియా సూలే స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అజిత్ దాదాకు 65 ఏండ్లు.. ఆయన సీనియర్ సిటిజన్ అని వ్యాఖ్యానించారు.
Ajit Pawar- Supriya Sule | మహారాష్ట్రలో పవార్ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
తన తండ్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వయస్సుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తనయ, ఎంపీ సుప్రియా సూలే ఘాటుగానే రియాక్టయ్యారు. ‘అజిత్ దాదా (సోదరుడు)కు 65 ఏండ్లు. ఆయన ఇప్పుడు సీనియర్ సిటిజన్’ అని పేర్కొంటూ పరోక్షంగా అజిత్ పవార్ రిటైర్ కావాలని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరెత్తకుండానే ‘కొంత మంది 80 ఏండ్లు దాటినా రిటైర్ కావడానికి సిద్ధంగా లేరు’ అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వోద్యోగులు 58 ఏండ్లకే రిటైరవుతారు. సాధారణంగా అత్యధికులు 75 ఏండ్ల వయస్సు దాటే వరకూ తమ ప్రొఫెషనల్ లైఫ్ నుంచి తప్పుకుంటారు. కొందరు 60, 65, 70 ఏండ్లకు రిటైర్ అవుతారు. కానీ ఈ మనిషి (శరద్ పవార్) 80 ఏండ్లు దాటినా రిటైర్ కావడం లేదు. ఆయన వయస్సు 84 ఏండ్లు. ఏం జరుగుతున్నది’ అని ఠాణే జిల్లాలోని కల్యాణ్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అజిత్ పవార్ అన్నారు.
శరద్ పవార్ వర్గంలో కొనసాగుతున్న రోహిత్ పవార్ వ్యాఖ్యలపైనా అజిత్ పవార్ రియాక్టయ్యారు. ‘ఆయన పిల్లవాడు. విమర్శలు చేసేంత సీనియర్ కాదు. అతడి వ్యాఖ్యలపై నేను స్పందించడానికి టైం రావాలి. ఆయన విమర్శలకు మా పార్టీ అధికార ప్రతినిధి స్పందిస్తారు’ అని కొట్టిపారేశారు. ఎమ్మెల్యే రోహిత్ పవార్‌పైనా అజిత్ వ్యాఖ్యలను సుప్రియా సూలే కొట్టి పారేశారు. తన మేనల్లుడు (రోహిత్) గురించి ఏదైనా మాట్లాడాల్సిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

