Modi 3.0 : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా కాంగ్రెస్ నేత, వారణాసిలో ప్రధానిపై పోటీ చేసిన అజయ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ఈసారి సంకీర్ణం ప్రభుత్వం కొలువుతీరుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ, జేడీయూ ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.
గతంలో కాషాయ పాలకులు చేపట్టిన పనులు, వారి ఆలోచనా విధానం వేరని, అదే పోకడతో ఇప్పుడు వ్యవహరించడం కుదరదని స్పష్ఠం చేశారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలు భిన్నమైనవని, వాటి సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయని అన్నారు.
Read More :
Vice Chancellors | వీసీలు హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దు.. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు