తిరువనంతపురం: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి శుక్రవారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. 176 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ మోడ్‌లో సురక్షితంగా దిగింది. కాలికట్ విమానాశ్రయం నుంచి శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మానికి వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎగిరే సమయంలో తోకభాగం రన్‌వేను ఢీకొట్టింది.
వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ వెనక్కి తిప్పి తిరువనంతపురంలోఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ల్యాండింగ్‌కు ముందు విమానం బరువును తగ్గించేందుకు ఇంధనాన్ని ఖాళీ చేయడానికి పైలట్ విమానాశ్రయం చుట్టూ గంటపాటు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ మధ్య ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.