న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్ర యాణికులకు విమానయాన సంస్థ లు కీలక సూచనలు చేశాయి. వి మానాలు బయల్దేరే సమయానికి 3 గంటలు ముందే విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులను కోరాయి. విమానం బయల్దేరడానికి 75 నిమిషాల ముందు చెక్‌ఇన్‌ను క్లోజ్ చేయనున్నట్టు తెలిపాయి.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశాల నేపథ్యంలో సూచనలు చేస్తున్నట్టు పలు విమానయాన సంస్థలు వెల్లడించాయి.