Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య (Air Pollution) తీవ్రత కొద్దిమేర తగ్గింది. ఇటీవలే కాలంలో ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 400కి పైనే నమోదైన విషయం తెలిసిందే. తాజాగా గాలి నాణ్యత సూచీ 300 నుంచి 400 మధ్యే నమోదవుతోంది. అయినప్పటికీ తీవ్రమైన కేటగిరీలోనే ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. బుధవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 301గా రికార్డైంది.
లోధి రోడ్లో 254, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద 298, ఓఖ్లా ఫేజ్‌లో 298, డీటీయూలో 250, పూసాలో 281గా నాలి నాణ్యత సూచీ నమోదైంది. కొన్ని స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన విభాగంలో నమోదయ్యాయి. అశోక్ విహార్‌లో 316, ఆనంద్ విహార్‌లో 311, ఐటీవో ప్రాంతంలో 316, వజీర్‌పూర్‌లో 331, వివేక్ విహార్‌లో 318, షాదీపూర్‌లో 375గా గాలి నాణ్యత సూచీ నమోదైంది. గాలి కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
AI Lab | అంతరిక్షంలో ఏఐ ల్యాబ్.. లాంచ్ చేస్తున్న హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ
Azan Siripanyo | ఆయన రూటే వేరు..! రూ.40వేలకోట్ల ఆస్తిని కాదని.. బౌద్ధ భిక్షువుగా మార్పు..!
Maharashtra | మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరూ..? షిండేను కొనసాగిస్తారా.. ఫడ్నవీస్‌కు ఛాన్స్ ఇస్తారా?