AI Lab | న్యూఢిల్లీ: అంతరిక్షంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. దీనిని వచ్చే నెలలో ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నట్టు ‘టేక్‌మి2స్పేస్’ స్టార్టప్ కంపెనీ మంగళవారం తెలిపింది. ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్-టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్.. అంతరిక్షంలో భారతదేశపు మొట్టమొదటి ఏఐ ల్యాబ్‌గా కంపెనీ పేర్కొన్నది. కక్ష్యలో రియల్-టైమ్ డాటా ప్రాసెసింగ్, అంతరిక్ష పరిశోధనను మరింతగా అందుబాటులోకి తీసుకురావటం ‘ఏఐ ల్యాబ్’ ముఖ్య ఉద్దేశంగా తెలిపింది. శాటిలైట్స్ పంపే డాటాను..అంతరిక్షంలోనే ఏఐ ల్యాబ్ ప్రాసెస్ చేస్తుందని కంపెనీ సీఈవో చెప్పారు.