Air India | క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా సీఈవో.. విమానాల్లో ఆల్కహాల్ సర్వీస్ విధానంపై సమీక్ష..!
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందుకు గానూ, క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ విమానాల్లో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సమీక్షించనున్నట్లు
Air India | ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందుకు గానూ, క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ విమానాల్లో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. విమానంలో ఆల్కహాల్ సర్వీస్, సంఘటనల మేనేజ్మెంట్, బోర్డులో ఫిర్యాదుల నిర్వాహణ, నమోదుతోపాటు సిబ్బంది వల్ల ఇతర లోపాలు ఉన్నాయా అనే దానిపై అంతర్గత దర్యాప్తులు వంటి అంశాలపై ఎయిర్‌లైన్ సమీక్ష చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్‌లో ట్రావెల్ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్తా ఇటీవల వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఒక పైలట్, నలుగురు సిబ్బందిపై ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. వారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడంతోపాటు విధులకు దూరంగా ఉంచి గ్రౌండ్ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న మిగతా సిబ్బందిపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

