Air India | ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండిమా విమానాన్ని అత్యవసరంగా మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం AI174 నవంబర్ 2న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం కోల్‌కతా మీదుగా ఎగురాల్సి ఉంది. కానీ, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తుతుందని భావించిన పైలట్ ముందస్తు జాగ్రత్తగా మంగోలియాలో ల్యాండ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు.
ఫ్లైయిట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. బోయింగ్ 777 విమానాన్ని ప్రస్తుతం తనిఖీ కోసం ఉలాన్బాతర్ విమానాశ్రయంలో ఉంచినట్లు పేర్కొంది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకులకు ఆహారం, వసతి కోసం ఎయిర్‌లైన్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది. సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి సాంకేతిక బృందం అందుబాటులో ఉందని.. వివరణాత్మక తనిఖీని నిర్వహిస్తోంది. ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకులా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు.
AI174 విమానం పైలట్లు విమాన ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించి, భద్రతా కారణాల దృష్ట్యా మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమాన ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తలేదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత విమానాన్ని తిరిగి ఎగరడానికి అనుమతి వస్తుందని.. విమానంలో ఉన్న ప్రయాణికులు ఎంత మంది ఉన్నారో చెప్పలేదు కానీ.. అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పింది. భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడానికి నిపుణుల బృందం ప్రస్తుతం విమానం వ్యవస్థలన్నింటినీ పరిశీలిస్తోందని వివరించింది.