న్యూఢిల్లీ, జూన్ 14: ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించాలన్న పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు తనిఖీలు ప్రారంభమయ్యాయి.
తొమ్మిది డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు పూర్తి చేశామని, మిగిలిన 24 విమానాల్లో త్వరలోనే పూర్తి చేస్తామని ఎయిర్ ఇండియా శనివారం తెలిపింది. ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. విమానాలు ఆలస్యం కావచ్చునని, సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వెల్లడించింది.