చండీగఢ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. (Air Force Jet crashes) అయితే పైలట్ సురక్షితంగా దాని నుంచి బయటపడ్డాడు. హర్యానాలోని పంచకుల సమీపంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ శిక్షణ కోసం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయ్యింది.
కాగా, ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. గుర్తించిన పైలట్ ఆ యుద్ధ విమానాన్ని జనావాస ప్రాంతాలకు దూరంగా నడిపాడు. ఆ తర్వాత పారాచూట్ సహాయంతో విమానం నుంచి దూకేశాడు. దీంతో ఆ ఫైటర్ జెట్ నేలపై కూలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడగా, శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఈ విషయాన్ని ధృవీకరించింది. ట్రైనింగ్ సందర్భంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం కూలినట్లు తెలిపింది. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నివాస స్థలాలకు దూరంగా ఫైటర్ జెట్‌ను నడిపినట్లు పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.
Panchkula, Haryana: A fighter jet crashed near Baldwala village in the Morni Hills area, causing panic among locals. The pilot ejected safely using a parachute. Local police reached the spot after receiving the information pic.twitter.com/Zb0iWXzqGB
— IANS (@ians_india) March 7, 2025