న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తయితేనే భారత్ కరోనా వైరస్ నుంచి బయటపడుతుందని అప్పటివరకూ మనం విశ్రమించరాదని ఎయిమ్స్ వైద్య విభాగాధిపతి డాక్టర్ నవనీత్ విగ్ స్పష్టం చేశారు. శుక్రవారం దేశవ్యాప్తంగా కోటికిపైగా వ్యాక్సిన్లు వేయడం కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. ఇది అరుదైన ఘనతేనని, రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా సాగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం, వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. మనం మాస్క్‌లు ధరించి, అందరికీ వ్యాక్సిన్ లభించేలా చేయడం ద్వారానే మహమ్మారిని అడ్డుకొగలమని అన్నారు. మరోవైపు శుక్రవారం ఒక్కరోజులో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోటి మార్క్‌ను దాటడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. రికార్డు వ్యాక్సినేషన్ నెంబర్స్..కోటికి పైగా వ్యాక్సిన్లను అందించడం అరుదైన ఫీట్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.