AIADMK faction war | అన్నాడీఎంకేలో వర్గాల పోరు తీవ్రం.. పార్టీ కార్యాలయాల వద్ద ఘర్షణలు
AIADMK faction war | తమిళనాడులోని అన్నాడీఎంకేలో వర్గాల పోరు తీవ్రమవుతున్నది. పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల వద్ద కే పళనిస్వామి, సీవీ షణ్ముగం వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకేలో వర్గాల పోరు తీవ్రమవుతున్నది. పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల వద్ద కే పళనిస్వామి, సీవీ షణ్ముగం వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. (AIADMK faction war) సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా వేలుమణి నేతృత్వంలోని 27 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి అనుకూలంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పార్టీ పదవుల నుంచి ఈపీఎస్ తొలగించారు. కొత్త జిల్లా కార్యదర్శులను ప్రకటించారు,
కాగా, ఈ పరిణామాలతో రెండు వర్గాలుగా అన్నాడీఎంకే చీలిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ పళనిస్వామి, సీనియర్ నేత షణ్ముగం వర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. శనివారం విల్లుపురం, కడలూరులోని పార్టీ కార్యాలయాల బయట ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. విల్లుపురంలో కొత్తగా నియమితులైన జిల్లా కార్యదర్శి పశుపతి పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా షణ్ముగం వర్గం వారు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరుగడంతో ఉద్రిక్తత పెరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను పార్టీ కార్యాలయం నుంచి పంపివేశారు.
మరోవైపు కడలూరులోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కూడా ఇలాంటి ఘర్షణ జరిగింది. పార్టీ కార్యాలయం గేట్కు షణ్ముగం వర్గం తాళాలు వేసింది. ఆ తర్వాత, ఈపీఎస్ వర్గం మద్దతుదారులు సుత్తితో ఆ తాళాన్ని పగులగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు. దీంతో ఇరు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. కరూరులోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కూడా శుక్రవారం ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.
கடலூர் மாவட்ட அ.தி.மு.க அலுவலகத்தின் பூட்டை உடைத்து ஆதரவாளர்களுடன் உள்ளே நுழைந்த இ.பி.எஸ் ஆதரவு நிர்வாகிகள்!#Cuddalore | #ADMK | #EPS | #EdappadiPalaniswami | #PolimerNews pic.twitter.com/pFL6RhjE9T
— Polimer News (@polimernews) May 16, 2026
विलुप्पुरम, तमिलनाडु: कड़ी सुरक्षा तैनाती के बीच विलुप्पुरम स्थित AIADMK कार्यालय के बाहर गाड़ी पार्किंग को लेकर पुलिस और AIADMK के पूर्व नेता सी. वी. षणमुगम के समर्थकों के बीच कहा-सुनी और हाथापाई हो गई। pic.twitter.com/eN88onQj2b
— IANS Hindi (@IANSKhabar) May 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

