న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు పట్ల క్రేజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అన్ని రంగాలు ఆదరిస్తున్నాయి. అయితే ఏఐ సేవల్ని వ్యవసాయంలోనూ వాడారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల మహారాష్ట్రలోని బారామతిలో ఓ స్టడీ నిర్వహించింది. దాంట్లో ఏఐ ద్వారా పంట దిగుబడి రెట్టింపు అయినట్లు తేలిసింది. ఆ విషయానికి చెందిన వీడియోను సీఈవో సత్యా నాదెళ్ల(Satya Nadella) తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ పోస్టుకు బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏఐ టెక్నాలజీతో రైతులు తమ పంట దిగుబడిని పెంతున్నట్లు ఇటీవల సత్యా నాదెళ్ల పేర్కొన్నారు. మహారాష్ట్రలో చిన్నకారు చెరుకు పంట రైతులు ఎప్పుడు కష్టాల్ని ఎదుర్కొనేవాళ్లు. అప్పులు, ఆత్మహత్యలు వాళ్లకు కామన్. వర్షాభావ పరిస్థితులు, వ్యాధులతో పంట దిగుబడే పెరిగేది కాదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ సమస్యలు తీరినట్లు సత్యా నాదెళ్ల పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన ప్రజెంట్ చేశారు. బిట్టిస్ షిరాలకు చెందిన ఓ చిన్న రైతు.. తన పంట దిగుబడి పెంచినట్లు చెప్పారు. రసాయనాల వాడకాన్ని కూడా తగ్గించినట్లు వెల్లడించారు. నీటిని పొదుపుగా వాడుతూ ఆ రికార్డు సాధించినట్లు చెప్పారు. వ్యవసాయంలో ఏఐ ప్రభావం అసాధారణమైందన్నారు.
డ్రోన్లు, శాటిలైట్లతో జియోస్పేషియల్ డేటాను వాడుకున్న రైతులు.. తమ స్వంత భాషలో ఆ సమాచారన్ని తెలుసుకుని, పంట దిగుబడి పెంచుకున్నట్లు వెల్లడించారు. అయితే సత్యా నాదెళ్ల చేసిన ట్వీట్‌కు.. బిలియనీర్ మస్క్ రియాక్ట్ అవుతూ.. ఏఐ అన్నింటినీ ఇంప్రూవ్ చేస్తుందన్నారు. ఆ వీడియోను చూడండి.
A fantastic example of AI’s impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ
— Satya Nadella (@satyanadella) February 24, 2025