Winter Session | డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (all party meeting)కు పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి (Parliamentary Affairs Minister ) కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈనెల 30వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు కొనసాగనున్నాయి. ఈ మూడు వారాల సెషన్లో మొత్తం 15 సిట్టింగ్లు ఉంటాయి. ఈ సమావేశాలు కీలకమైన సమయంలో జరుగుతుండటం వల్ల చర్చలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా, 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) పై పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
Ahead of the Winter Session of Parliament, Parliamentary Affairs Minister Kiren Rijiju has called an all-party meeting on November 30: Sources
— ANI (@ANI) November 25, 2025
Also Read..
Benjamin Netanyahu | నెతన్యాహు భారత్ పర్యటన మరోసారి వాయిదా.. ఢిల్లీ బాంబు పేలుళ్లే కారణం!
Chinese Man: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి.. బోర్డర్ వద్ద వీడియో తీస్తున్న చైనా వ్యక్తి అరెస్టు
Hayli Gubbi Volcano | హైలీ గబ్బి అగ్నిపర్వత విస్పోటనం.. ఢిల్లీకి చేరిన పొగ మబ్బులు