గౌహతి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేందుకు అస్సాంలోని కీలక ప్రాంతాల్లో 24 బాంబులు (IED-like objects) అమర్చినట్లు నిషేధిత తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) (ఇండిపెండెంట్) ప్రకటించింది. 19 ప్రాంతాల వివరాలను కూడా ఉల్ఫా(ఐ) పేర్కొంది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఈమెయిల్ పంపింది. అయితే సాంకేతిక వైఫల్యం కారణంగా ఆ బాంబులు పేలలేదని తెలిపింది. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రజల సహకారాన్ని కోరింది.
కాగా, ఉల్ఫా(ఐ) ప్రకటన నేపథ్యంలో అస్సాం పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేశారు. ఉల్ఫా(ఐ) ఈమెయిల్లో పేర్కొన్న అన్ని ప్రదేశాలకు బాంబు నిర్వీర్య స్క్వాడ్లు, మెటల్ డిటెక్టర్లు, స్నిఫర్ డాగ్లను తరలించారు. భారీ తనిఖీల తర్వాత రాజధాని గౌహతిలో ఐఈడీ వంటి రెండు వస్తువులను గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాంబులను గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Assam Police has carried out extensive searches throughout the State today for Explosive devices. At two places in Guwahati suspicious articles were found which were opened by Bomb Disposal Squad of Police. These articles do not have ignition device inside through some circuits…
— GP Singh (@gpsinghips) August 15, 2024