Nitin Gadkari | దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ ఒకే విధమైన టోల్ విధానం అమలు చేయాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారులపై (Highway Tolls) ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వాహనదారులు దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన జాతీయ రహదారులపై అధిక టోల్ ఛార్జీలు వసూలు చేయడం, రహదారి సేవలు తగినంతగా అందకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోలింగ్‌పై నితిన్ గడ్కరీ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రయాణికులకు ‘త్వరలో’ ఉపశమనం లభిస్తుందని అన్నారు.
కొత్త టోల్ పథకానికి సంబంధించిన తమ పరిశోధన పూర్తైందని.. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ‘టోల్ వసూళ్లపై సోషల్ మీడియాలో అనేక మీమ్‌లు వస్తున్నాయని నాకు తెలుసు. చాలా మంది నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. టోల్ విషయంలో ప్రజలు కొంచెం కోపంగా ఉన్నారు. ఈ కోపం కొద్ది రోజుల్లో తొలిగిపోతుందని నేను చెప్పగలను’ అని గడ్కరీ తెలిపారు. అయితే, టోల్‌ను రద్దు చేస్తారా..? లేక టోల్ ఫీజు తగ్గిస్తారా..? అన్నదానిపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా త్వరలో ఉపశమనం లభిస్తుందన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
Also Read..
Ratan Tata | రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి పేరు.. ఇంతకీ ఎవరీ మిస్టరీ మ్యాన్..?
Maha Kumbh Mela | మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
Plane Missing | అమెరికాలో విమానం మిస్సింగ్.. రంగంలోకి దిగిన అధికారులు