సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిమ్లాలోని రోహనా సమీపంలో జాతీయ రహదారి 707పై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. (Massive Landslide) రహదారిపై కొండ రాళ్లు పేరుకుపోయాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని హట్కోటి, పౌంటా సాహిబ్‌ను కలిపే హైవేను మూసివేశారు. భారీగా కొండచరియలు విరిగిపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 80కి పైగా రహదారులను మూసేశారు. శనివారం భారీ వర్షాల కారణంగా మండిలో 38, కులులో 14, సిమ్లాలో 5, సిర్మౌర్‌లో 4, కాంగ్రా జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో 154 ట్రాన్స్ఫార్మర్లు, 26 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు కాంగ్రా జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధర్మశాల, పాలంపూర్‌లో 200 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. జూలై 12 వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. కాంగ్రా, కులు, కిన్నౌర్, మండి, ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#Video | Massive Landslide In Himachal Pradesh's Shimla After Heavy Rain https://t.co/AcVivKu7Dw… pic.twitter.com/kuPEoaWXLl
— sunshine@Nature🏝️🌲 (@sunshinesandy00) July 7, 2024