చెన్నై: ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. (107 Hospitalised) తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్విమడై గ్రామంలో ఆదివారం గుడి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా వడ్డించిన ఆహారాన్ని తిన్న తర్వాత 107 మంది వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో అనారోగ్యం చెందారు. దీంతో వారిని మధురైలోని ప్రభుత్వ రాజాజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆసుపత్రిలో చేరిన 107 మందిలో 55 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఎవరికీ ప్రాణాంతక ప్రమాదం లేదని చెప్పారు. కలుషితమైన తాగునీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాలుష్యం మూలాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: