పాట్నా: పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరించిన తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు వినూత్నంగా బర్త్ డే విషెష్ చెప్పారు. లాలూ యాదవ్ స్కెచ్ చిత్రాన్ని కౌగిలించుకున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ‘రాత్రి చీకటిగా ఉంటే, ఉదయం దగ్గరగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన 78వ పుట్టిన రోజును బుధవారం ఘనంగా జరుపుకున్నారు. అయితే ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మే 25న సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక మహిళతో 12 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై సీరియస్‌గా స్పందించారు. తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు ఆర్జేడీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. అలాగే తన పెద్ద కుమారుడిని కుటుంబం నుంచి కూడా వెలివేసినట్లు వెల్లడించారు. ‘అతడితో సన్నిహితంగా ఉండాలనుకునే వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. నేను ఎల్లప్పుడూ ప్రజా జీవితంలో మర్యాదను సమర్థించాను. కుటుంబ విధేయులైన సభ్యులు దీనిని అనుసరించారు’ అని నాడు ఎక్స్‌లో పేర్కొన్నారు.
“अंधेरा जितना गहरा होगा, सुबह उतनी ही नजदीक होगी।” #TejPratapYadav #Bihar #India pic.twitter.com/gAdlvZFtlb
— Tej Pratap Yadav (@TejYadav14) June 9, 2025
Also Read: