students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు.. 80 మంది ఆసుపత్రిపాలు
students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముంబై: ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (students hospitalised) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కేకేట్ జల్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార భోజన పథకం కార్యక్రమంలో భాగంగా బిస్కెట్లు ఇచ్చారు. అవి తిన్న తర్వాత వికారం, వాంతులతో విద్యార్థులు అస్వస్థత చెందారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, ఇతర అధికారులు వెంటనే ఆ పాఠశాలకు చేరుకున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. బిస్కెట్లు తిన్న తరువాత స్కూల్లోని 257 మంది విద్యార్థుల్లో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ తెలిపారు. ఉదయం 8.30 గంటలకు 153 మంది బడి పిల్లలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు చెప్పారు.
మరోవైపు చికిత్స తర్వాత పలువురు విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. సుమారు 80 మందికి గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్ర లక్షణాలున్న ఏడుగురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

