PM Modi | నాందేడ్, ఏప్రిల్ 20: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.
నాందేడ్‌లో ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ.. ఈసారి వయనాడ్‌లో కూడా ఓటమి చవిచూడబోతున్నారని, ఇప్ప టికే ఓటమి భయంతో సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లారని చెప్పారు.