Zakia wardak | ముంబయి : సుమారుగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ముంబై విమానాశ్రయ అధికారులకు దొరికిపోయిన ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జాకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. విమానాశ్రయ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 25న జాకియా వార్దాక్ (58) తన కుమారుడితో కలిసి దుబాయ్ నుంచి ముంబయి చేరుకున్నారు.
తనిఖీల్లో జాకియా నడుముకు ఉన్న జాకెట్, బెల్ట్, మోకాలు వద్ద రహస్యంగా బంగారు కడ్డీలు దాచుకొని, అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. దీంతో ఆమెపై బంగారం అక్రమ రవాణా, కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదైంది.