Kolkata Incident : కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నగరంలో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్ధులు, మహిళలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల కార్యకర్తలు ఈ హేయమైన ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే నిరసనలను తొక్కిపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నదో తనకు అర్ధం కావడం లేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు.
పలు ప్రాంతాల్లో నిరసనలను నిలువరించేందుకు ఆంక్షలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలు కొనసాగేలా పాలక, విపక్షాలు కలిసి కూర్చుని చర్చించాలని ఆయన కోరారు. కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘటనను నిరసిస్తూ ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్’ విద్యార్థి సంఘం మంగళవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్నా అభియాన్’ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు.
Read More :