ఒమిక్రాన్ వ్యాక్సిన్‌పై అదర్ పునావాలా కీలక ప్రకటన..!
న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్‌కు నిర్ధిష్ట వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. గురువారం ఓ కార్యాక్రమంలో పాల్గొన్న ఆయన.. విలేకరులతో మాట్లాడారు. ఒరిజినల్ నోవోవాక్స్ కొవిడ్ టీకా ఒమిక్రాన్‌ను సైతం అడ్డుకుంటుందని, ఇందుకు సంబంధించిన కీలక డేటా ఉందన్నారు. రాబోయే ఆరు నెలల్లో తాము ఒమిక్రాన్‌కు నిర్ధిష్ట వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్.. ఒమిక్రాన్‌కు వ్యాక్సిన్‌ను తెచ్చేందుకు అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ నోవావాక్స్తో కలిసి పని చేస్తుంది. కొవిడ్-19 నుంచి కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందడంతో ఒమిక్రాన్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ప్రస్తుతం కోవోవాక్స్ కొవిడ్ టీకా భారత్‌లో 12 సంవత్సరాలు పైబడిన వారందరికీ అందుబాటులో ఉన్నది. మంకీపాక్స్‌పై స్పందిస్తూ.. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అవసరం ‘చర్చించదగినది’ అని అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఈ అంశంపై సైతం పరిశోధన చేస్తున్నామని, బయోటెక్నాలజీ విభాగం సహకారంతో పరిశోధన జరుగుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

