న్యూఢిల్లీ: రానున్న 2-3 ఏండ్లలో అధిక లాభాలపై అదానీ గ్రూప్ కన్నేసింది. అన్ని రంగాల వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసి ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది. రూ.90 వేల కోట్ల ఎబిట్డాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎబిట్డా అంటే వడ్డీలు, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ందు కంపెనీ ఆర్జించే లాభం. కాగా, మార్చి 2023తో అంతమైన ఆర్థిక సంవత్సరం ఫలితాలు చూస్తే అదానీ గ్రూప్ ఏడాదికి 36 శాతం పెరుగుదలతో 57,219 కోట్ల ఎబిట్డా సాధించింది. దీనిని రానున్న 2-3 ఏండ్లలో రూ.90 వేల కోట్లకు చేర్చాలని నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ 2.65 బిలియన్ యూఎస్ డాలర్ల రుణ బకాయిలను తీర్చింది.