న్యూఢిల్లీ, మే 10: దేశంలో హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను అదానీ గ్రూపు సంస్థలు తొలిసారి వినియోగించాయి. చత్తీస్‌గఢ్‌లోని గనుల్లో లాజిస్టిక్ అవసరాల నిమిత్తం 40 టన్నుల సరుకును తరలించే ఈ ట్రక్కును వినియోగించింది.
200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ ట్రక్కును వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో వినియోగించినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ సీఈవో వినయ్ ప్రకాశ్ తెలిపారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి అదానీ గ్రూపు మరో ముందడుగు వేసిందన్నారు.