Parliament winter session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను (waqf bill ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై (Adani bribery case) యూఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఇందులో భాగంగానే సమావేశాల ప్రారంభానికి ముందు ఇండియా కూటమి నేతలు పార్లమెంట్లో భేటీ అయ్యారు. పలు అంశాలపై తీవ్రంగా చర్చించారు. ఇక ఇప్పటికే అదానీ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో పాటు సంభాల్‌లో హింసపై ఎంఐఎం వాయిదా తీర్మానం ఇచ్చింది.
26న ప్రసంగించనున్న రాష్ట్రపతి
రాజ్యాంగ ఆమోద 75వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి గుర్తుగా మంగళవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాత పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రసంగిస్తారు. ‘హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్’ పేరుతో ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం తెలిపారు.
Also Read..
IND Vs AUS | స్టీవ్ స్మిత్ ఔట్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ
KTR | మహబూబాబాద్ మహా ధర్నాకు బయల్దేరిన కేటీఆర్
Sambhal | మసీదు సర్వే.. సంభల్‌లో ఇంటర్నెట్, స్కూల్స్ బంద్