Mamta Kulkarni | ఆ పదవికి రాజీనామా చేశా.. సాధ్విగా కొనసాగుతా : మమతా కులకర్ణి
Mamta Kulkarni | కిన్నర్ అఖాడా (Kinnar Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Mamta Kulkarni : తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కిన్నర్ అఖాడా (Kinnar Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు.
‘నేను (మహామండలేశ్వర్ మమత నందగిరి) నా పదవికి రాజీనామా చేశా. నా పదవి విషయంలో రెండు గ్రూపులు గొడవ పడటం సరికాదు. 25 ఏళ్లుగా నేను సాధ్విగా ఉన్నా. ఇకముందు కూడా అలాగే కొనసాగుతా. మహామండలేశ్వర్‌గా నన్ను నియమించడంపై గొడవ మంచిదికాదు. 25 ఏళ్ల క్రితమే నేను బాలీవుడ్‌ను విడిచిపెట్టా. అప్పటి నుంచి అందరికీ, అన్నింటికీ దూరంగా ఉంటున్నా. నా గురించి ప్రజలు రకరకాలుగా స్పందించడం చూశా. శంకరాచార్య కావచ్చు.. మరొకరు కావచ్చు.. నన్ను మహామండేలేశ్వర్గా నియమించడం కొందరికి అభ్యంతరకరంగా తోచి ఉండవచ్చు. నేను కైలాస్కో, మానస సరోవర్కో వెళ్లనక్కర లేదు. 25 ఏళ్ల తపస్సుతో విశ్వం నా కళ్లముందే ఉంది.’ అని ఆ వీడియోలో మమతా కులకర్ణి చెప్పారు.
#WATCH | Prayagraj | Mamta Kulkarni says, “I am resigning from the post of Mahamandaleshwar of Kinnar Akhada. I have been ‘sadhvi’ since my childhood and I’ll continue to be so…”
(Source – Mamta Kulkarni) pic.twitter.com/iQAmmBkjVR
— ANI (@ANI) February 10, 2025
కాగా, మహామండలేశ్వర్‌గా మమతా కులకర్ణిని నియమించడంపై అఖాడా సాధువులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రిషి అజయ్ దాస్ చర్యలు తీసుకున్నారు. మమతా కులకర్ణిని, లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని పదవుల నుంచి తొలగించారు. అజయ్ దాస్ చర్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహామండలేశ్వర్ పదవి నుంచి తనను తొలగించడంపై లక్ష్మీనారాయణ్ త్రిపాఠి అభ్యంతరం వ్యక్తంచేశారు. అఖారా నుంచి 2017లో బహిష్కృతుడైన అజయ్ దాస్ తనను పదవి నుంచి తొలగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Delhi CM post | ఢిల్లీ సీఎం పదవి ఒక మహిళను వరించబోతోందా..?
Manipur CM face | పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే
Devendra Fadnavis | వాక్ స్వేచ్ఛ ఉందికదా అని నోరు పారేసుకోవద్దు.. యూట్యూబర్‌కు మహా సీఎం వార్నింగ్
Naresh Mhaske | అది పెళ్లికొడుకు లేని పెళ్లి ఊరేగింపు.. ఇండియా కూటమిపై శివసేన ఎంపీ కామెంట్
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

