ముంబయి : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భాగస్వాములయ్యారు. ముంబయి అంధేరిలోని వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో సిద్ధార్థ్ మొక్కలు నాటారు. యోధ చిత్రంలోనటిస్తున్న సిద్ధార్థ్.. ఆ మూవీ డైరెక్టర్లు సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజాతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. గ్రీన్ ఇండియా చాలెంజ్ గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని సిద్ధార్థ్ పిలుపునిచ్చారు.
Thank you @SidMalhotra ji for accepting #GreenIndiaChallenge and planting sapling. Hoping that your 10M followers across the world on @Twitter would replicate what you have done today, in the interest of the better future. Wish you all the best for #Yodha Movie.#Appreciate🌱. pic.twitter.com/HYsKQQZXxG
— Santosh Kumar J (@MPsantoshtrs) November 27, 2021