భోపాల్: గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ (Medha Patkar’s Agitation) డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత వారం రోజులుగా ఆమె ఆందోళన చేస్తున్నారు. ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి అయిన ఆమె మధ్యప్రదేశ్ చిఖల్దా గ్రామంలోని ఖేదా బస్తీలో నిరసన చేపట్టారు. నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, మేధా పాట్కర్ ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఒడిశాకు చెందిన కార్యకర్త ప్రఫుల్ల సమంతర, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే, సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు డాక్టర్ సునీలం బుధవారం ఖేడా బస్తీకి చేరుకున్నారు. మేధా పాట్కర్ నిరసనకు మద్దతు తెలిపారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలని వారు డిమాండ్ చేశారు. నిర్వాసితుల డిమాండ్లను నెరవేర్చకపోతే మేధా పాట్కర్ ఆందోళనను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు.
#MedhaPatkar on hunger strike for rehabilitation of Sardar Patel dam evictees.
Her condition has worsened as Gandhian protest enters 6th day.
शुगर लेवल कम होने के कारण हो रही उल्टियां स्वास्थ्य विभाग पहुंचा धरना स्थल लेकिन कोई प्रशासनिक अधिकारी नहीं पहुंचे मौके पर pic.twitter.com/6vYZhjhHqX— Madhavan Narayanan (@madversity) June 20, 2024