న్యూఢిల్లీ : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ బెయిల్‌పై విడుదలైన ఓ నిందితుడికి అతని మద్దతుదారులు ఘనస్వాగతం పలకడం సంచలనం సృష్టించింది.
జేజేలు కొడుతూ నిందితుడిని తమ భుజాలపైకి ఎత్తుకున్న అతని మద్దతుదారులు కరచాలనాలు, కేరింతలు, సంబరాలతో విజయోత్సవాన్ని తలపించే రీతిలో ఊరేగింపుగా తరలివెళుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ, అధర్మబద్ధమైన బీజేపీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు.