న్యూఢిల్లీ, మార్చి 10: దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డాటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డాటా చోరీ జరిగిందని ఇన్కాగ్ని సంస్థ వెల్లడించింది. డాటా చోరీ బాధిత టాప్-5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నదని వివరించింది.
అమెరికాలో 20.7 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీకి గురైందని ఇన్కాగ్ని పేర్కొన్నది. భారత్ తర్వాత యూకే, బ్రెజిల్, కెనడా దేశాల్లో వ్యక్తిగత డాటా చోరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది.