Udhayanidhi Stalin | నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ.. దేశాన్ని ఏకం చేయలేదు: ఉదయనిధి
Udhayanidhi Stalin | కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష భారత దేశాన్ని ఏకం చేయలేదని తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. గురువారం హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని ఆయన ఖండించారు.
చెన్నై: కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష భారత దేశాన్ని ఏకం చేయలేదని తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. గురువారం హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని ఆయన ఖండించారు. భారతదేశాన్ని హిందీ ఏకం చేస్తుందని అమిత్ షా చెప్పడం అసంబద్ధమని దుయ్యబట్టారు. ‘దేశ ప్రజలను హిందీ ఏకం చేస్తుంది – ప్రాంతీయ భాషలకు సాధికారత చేకూరుస్తుంది’ అని అన్న కేంద్ర మంత్రి అమిత్ షా, ఎప్పటిలాగే హిందీ భాషపై ప్రేమను కురిపించారని ఉదయనిధి విమర్శించారు. హిందీ చదివితేనే పురోగమించవచ్చన్న నినాదానికి ఈ ఆలోచన ప్రత్యామ్నాయ రూపమని మండిపడ్డారు.
కాగా, తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం మాట్లాడతారని ఉదయనిధి తెలిపారు. ‘ఈ రెండు రాష్ట్రాలను హిందీ ఎక్కడ కలుపుతుంది? సాధికారత ఎక్కడ వస్తుంది?’ అని ప్రశ్నించారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష యావత్ దేశాన్ని ఏకం చేస్తుందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఇతర ప్రాంతీయ భాషలను కించపరచడాన్ని అమిత్ షా మానుకోవాలి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘హిందీని రుద్దటాన్ని ఆపండి’ అన్న హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
I strongly condemn the statement of Union Home Minister Amit Shah claiming that Hindi is the uniting force of India and it is empowering other regional languages.
Hindi is spoken only in four or five states in the Country and hence the statement of Amit Shah is totally absurd.…
— Udhay (@Udhaystalin) September 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Absurd
- Amit Shah
- Hindi
- Hindi Diwas
RELATED ARTICLES
తాజా వార్తలు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

