న్యూఢిల్లీ: బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది. అతని పిటిషన్‌ను కొట్టిపారేసింది. ఢిల్లీలో ఓ చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలి శిక్షపడిన వ్యక్తి.. కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు.
ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్ష సబబేనని సమర్థించింది. కాగా, పిటిషనర్ 2017లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన కింది కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
శిక్షపడిన వ్యక్తి కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై ఎలాంటి గాయాలు లేవని మెడికల్ రిపోర్టులలో తేలిందని, చేయని నేరానికి తనకు శిక్షపడిందని, కాబట్టి తనకు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని పిటిషనర్ కోరాడు. కానీ, ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం అతని పిటిషన్ కొట్టేసింది. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని భావించలేమని వ్యాఖ్యానించింది.