సీబీఐ, ఈడీ దుర్వినియోగం నిజమే
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా సీఓటర్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక పాన్ ఇండియా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
- 50% భారతీయుల మాట సీ ఓటర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా సీఓటర్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక పాన్ ఇండియా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2014 ఎన్నికల సమయంలో అవినీతికి వ్యతిరేకంగా సంపూర్ణంగా యుద్ధం చేస్తానన్నది మోదీ ప్రధానంగా ప్రచారం చేశారు.
అందులో భాగంగానే సీబీఐ, ఈడీ రెండూ చాలా దూకుడు ప్రదర్శించి అవినీతితో సంపాదించిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అయితే మోదీ పాలన ముఖ్యంగా తనకు రాజకీయంగా, ఎన్నికలలో సవాలుగా నిలిచే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే సాగిందన్న విమర్శలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు నిరంతరం ఆరోపిస్తూ వస్తున్నాయి. సీ ఓటర్ సర్వేలో ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థిస్తూ సుమారు 50 శాతం మంది భారతీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 35 శాతం మంది ఈ ఆరోపణను వ్యతిరేకించారు.
యుపీఏ మద్దతుదారుల్లో 60 శాతం మంది కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని అభిప్రాయపడగా.. ఎన్డీఏ మద్దతుదారుల్లో కూడా 30 శాతం మంది అదే విషయం చెప్పారు. వివిధ ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై గత తొమ్మిదేండ్లలో విచారణలు, దాడులు, అరెస్టులు ఎదుర్కొన్నారు. కొంత మంది జైళ్లకు కూడా వెళ్లారు. ప్రధాని మోదీ బలవంతుడు అనే భావనకు భిన్నంగా దాదాపు మెజారిటీ భారతీయులు ఆయన పాలన వీధిశక్తులకు లొంగిపోయిందని అభిప్రాయపడినట్టు సీ ఓటర్ సర్వేలో తేలింది. మోదీ ఎన్నో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల గురించి అడిగిన ప్రశ్నకు 47 శాతం మంది మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

